రైతు భరోసా దరఖాస్తుకు నేడే లాస్ట్ ఛాన్స్

2చూసినవారు
రైతు భరోసా దరఖాస్తుకు నేడే లాస్ట్ ఛాన్స్
TG: జూన్ 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు 'రైతుభరోసా' పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ దరఖాస్తు గడువు నేటి(జులై 5)తో ముగియనుంది. 'రైతుభరోసా' పొందని రైతులు సమీప AEO లేదా రైతు వేదికలో పట్టా పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, బ్యాంకుతో లింక్ అయిన మొబైల్ నంబర్ అందివ్వాలి. ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి రైతు భరోసా వస్తుందని మంత్రి తుమ్మల ఇదివరకే వెల్లడించారు. జులై 10 లోపు అందరి అకౌంట్లోల మనీ జమ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్