IPL-2026: లక్నో వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు బెంగళూరు, లక్నో జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో LSG ఓడితే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోనుంది. ఇప్పటివరకు 9 మ్యాచుల్లో 7 ఓటములు, 2 గెలుపులతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇక మిగతా 4 మ్యాచుల్లో గెలిచినా ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లే ఉంటాయి. ఇప్పటికే SRHకు 14, PBKSకు 13, RCB, RR, GTకి 12 పాయింట్ల చొప్పున ఉన్నాయి.