
భారీగా పెరగనున్న బీర్ల ధరలు
పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ముడి చమురు, గ్యాస్ ధరలు పెరగడంతో గాజు సీసాలు, అల్యూమినియం క్యాన్ల తయారీ ఖర్చు విపరీతంగా పెరిగింది. బీర్ల ప్యాకేజింగ్ ఖర్చు దాదాపు 45% వరకు ఉంటుంది. ఇంధన కొరత, రవాణా ఖర్చులు పెరగడంతో సీసాలు, క్యాన్ల ధరలు 20% పెరిగాయి. దీనివల్ల బీర్ కంపెనీల లాభాలు తగ్గి, వినియోగదారులపై భారం పడుతోంది. ధరల పెరుగుదలకు అనుమతి ఇవ్వాలని బ్రూవర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే మార్కెట్‌లో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




