
బ్యాంకుల్లో రూ.1.1 లక్షల కోట్లు.. యజమానులకు చేరేదెలా?
దేశవ్యాప్తంగా బ్యాంకులు, బీమా కంపెనీల ఖాతాల్లో యజమానులు క్లెయిం చేసుకోని సుమారు రూ.1.1 లక్షల కోట్ల ఆస్తులు పేరుకుపోయాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో రూ.83,000 కోట్లు బ్యాంకు డిపాజిట్లు, రూ.10,000 కోట్లు ఈక్విటీ పెట్టుబడులు, రూ.14,000 కోట్లు జీవిత బీమా పాలసీలు ఉన్నాయి. పాత రికార్డులు, పాన్-ఆధార్ అనుసంధానంలో సమస్యలు, అక్షర దోషాలు, అడ్రస్ మార్పులు, నామినీ వివరాలు లేకపోవడం వంటి కారణాలతో అసలైన వారసులు ఈ నిధులను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ‘ఉద్గమ్’ వంటి డిజిటల్ వేదికలు, ‘మీ డబ్బు-మీ హక్కు’ వంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, సమస్య ఇంకా పెద్దదిగానే ఉంది.




