ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు, రచయిత, జర్నలిస్ట్ బండి రఘురామ్ మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. 'వరం' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రఘురామ్, పలు మీడియా సంస్థల్లో స్పెషల్ కరస్పాండెంట్‌గా పనిచేశారు. జర్నలిజంలో ఎంఫిల్, ఇంగ్లీష్ లిటరేచర్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆయన, లిబ్యాన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చి, సానాయాదిరెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో-డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. రఘురామ్ మరణంతో చిత్ర పరిశ్రమతో పాటు మీడియా రంగంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.