భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధరలు

43892చూసినవారు
భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధరలు
AP: రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. అమాంతం పడిపోయిన ఉల్లి, టమాటా ధరలతో ఘోరంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్‌లో కిలో ఉల్లి 30 పైసలకు పడిపోయింది. కిలో టమాటా కర్నూలులో రూ.1, మదనపల్లిలో రూ.5గా ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్