భారీగా పడిపోయిన టమాటా ధరలు

10చూసినవారు
భారీగా పడిపోయిన టమాటా ధరలు
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. TGలోని ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 25 కేజీల బాక్స్ గత నవంబర్‌లో రూ.900 వరకు ఉండగా ప్రస్తుతం రూ.60-80 మాత్రమే పలుకుతోంది. కేజీకి రూ.2-3 మాత్రమే దక్కుతోంది. దీంతో రవాణా ఖర్చులు కూడా మిగలట్లేదని రైతులు వాపోతున్నారు. ఏపీలోని మదనపల్లెలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక బహిరంగ మార్కెట్‌లో కేజీ టమాటా రూ.5-10 వరకు అమ్ముతున్నారు.

సంబంధిత పోస్ట్