టమోటా గింజలు యాంటీఆక్సిడెంట్లు, ఫినాలిక్ సమ్మేళనాలు, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. లైకోపీన్, బీటా-కెరోటిన్ వంటివి కణాలను రక్షిస్తాయి. విటమిన్లు చర్మాన్ని, జుట్టును పునరుజ్జీవింపజేస్తాయి. అయితే, అసిడిటీ, గ్యాస్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్నవారు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉన్నవారు టమోటా గింజలతో ఇబ్బంది పడవచ్చంటున్నారు