దేశవ్యాప్తంగా ఆధార్ సేవా కేంద్రాల్లో 282 సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి CSC ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో 11, ఆంధ్రప్రదేశ్‌లో 4 పోస్టులున్నాయి. టెన్త్, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ ఆపరేటర్/సూపర్ వైజర్ సర్టిఫికేట్ అదనపు అర్హత. రాత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు జనవరి 31 చివరి తేదీ.