
పార్లమెంట్లో ఈ-సిగరేట్ తాగిన టీఎంసీ ఎంపీ.. బీజేపీ ఆరోపణలు (వీడియో)
పార్లమెంట్ పరిసరాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఈ-సిగరెట్ తాగినట్లు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్సభలో ఆరోపించారు. స్పీకర్ ఓం బిర్లా ముందు ఈ విషయాన్ని ప్రస్తావించగా, ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గత కొన్నేళ్లుగా ఈ-సిగరెట్లను భారతదేశంలో నిషేధించారు. సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల ప్రకారం, టీఎంసీ ఎంపీ మహువా మైత్రి ఈ-సిగరెట్ తాగుతున్నట్లు తెలిసింది.




