TG: హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్, నాగోల్, దిల్సుఖ్నగర్, కోఠి వంటి పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, ఉద్యోగులు,
విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు, జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమై ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు సూచించారు.