AP: చిత్రహింసలు పెడుతున్నారని, తనను కాపాడి స్వదేశానికి తీసుకురావాలని ఖతార్ నుంచి కోనసీమకు చెందిన లలిత ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం లలిత ఖతార్ వెళ్లారు. ఖతార్‌లో ఓ ఇంట్లో పనికి చేరారు. ఆ కుటుంబం వేధింపులు అధికమయ్యాయి. దాంతో తనను కాపాడాలని లలిత ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య లలితను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని భర్త పమ్మి గంగరాజు ప్రభుత్వాన్ని కోరారు.