నెల్లూరులో టూరిస్టు బస్సు బోల్తా.. వీడియో

44చూసినవారు
AP: నెల్లూరు హైవేపై ఏలూరు నుండి చెన్నై వైపు వెళ్తున్న టూరిస్ట్ బస్సు గురువారం ఉదయం నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ జంక్షన్ వద్ద  అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 38 మంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Job Suitcase

Jobs near you