మరోసారి వాయిదా పడిన ‘టాక్సిక్’

32చూసినవారు
మరోసారి వాయిదా పడిన ‘టాక్సిక్’
రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా విడుదల వాయిదా పడింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, నేడు విడుదల కావాల్సి ఉండగా, ఎలాంటి ప్రమోషన్స్ లేకపోవడంతో పుకార్లు షికారు చేస్తున్నాయి. కొన్ని కీలక సన్నివేశాలపై హీరో యష్ అసంతృప్తితో ఉన్నారని, 100 రోజుల పాటు రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. విదేశీ పంపిణీ సమస్యలు కూడా వాయిదాకు కారణమని అంటున్నారు. ఈ కారణాల వల్ల సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్