ప్రపంచంలోనే ఇందిరా గాంధీ ఉక్కు మహిళగా పేరుపొందారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గురువారం గాంధీ భవన్‌లో ఎంపీ అనిల్ యాదవ్, వి.హనుమంతరావుతో కలిసి వారి చిత్రపటాలకు నివాళులర్పించి మాట్లాడారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఆమెను అనుసరిస్తూ పీవీ నరసింహారావు భూ సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు.