TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రేగొండ మండలంలో ఓ ట్రాక్టర్ ప్రమాదశాత్తు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న చంద్రారెడ్డిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.