ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లోని నదిని దాటడానికి ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తు నదిలో ట్రాక్టర్ బోల్తాపడిన సంగతి తెలిసిందే. ట్రాక్టర్‌లో ఉన్న10 మంది వరదనీటిలో గల్లంతయ్యారు. అయితే తాజాగా వారిలో 8 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. వారి మృతదేహాలను ఒడ్డుకు తరలించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.