సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే వాహనాల తాకిడి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే వాహనాల సంఖ్య అధికంగా ఉండటంతో, ఎక్కువ టోల్ బూత్‌లను తెరిచారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 70వేల వాహనాలు ఏపీ వైపు వెళ్లాయని పంతంగి టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపారు.