వరుస సెలవుల నేపథ్యంలో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

32చూసినవారు
వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తీవ్రమైంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద మూడో రోజు కూడా రద్దీ కొనసాగుతోంది. పరిస్థితిని అదుపు చేయడానికి, 16 టోల్ బూతుల్లో 11 బూతులను విజయవాడ వైపు మళ్లించారు. ప్రస్తుతం నిమిషానికి సగటున 47 వాహనాలు వెళ్తున్నాయని, ఇప్పటివరకు సుమారు 1.30 లక్షల వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించాయని సమాచారం. ఆదివారం కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు, టోల్ సిబ్బంది సమన్వయంతో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్