ఓడిశాలో ఓ ట్రాఫిక్ పోలీస్ వినూత్నంగా విధులు నిర్వహిస్తూ అందరి మనసులు గెలుచుకున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఇస్తూ ఒక్కసారిగా సెల్యూట్ చేయడం, మరోసారి మోకాలిపై కూర్చుని నమస్కారం చేయడం, డ్యాన్స్ మూవ్స్‌తో ఆడుతూ పాడుతూ పనిచేయడం వీడియోలో కనిపిస్తోంది. వైరలైన ఈ వీడియోపై పలువురు నెటిజన్లు ఈ పోలీస్ స్టైల్‌ను ప్రశంసిస్తున్నారు. కొంతమంది ‘‘ప్యాషన్ ప్రొఫెషన్‌గా మారితే ఇలాంటిదే జరుగుతుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు.