
స్క్రబ్ టైఫస్ భయం వద్దు: వైద్య ఆరోగ్య శాఖ స్పష్టత
ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలను తొలగించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది. స్క్రబ్ టైఫస్ కొత్త వ్యాధి కాదని, ప్రతి సంవత్సరం సుమారు 1300 నుంచి 1600 కేసులు నమోదవుతాయని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1566 కేసులు నమోదయ్యాయని, గత సంవత్సరం 1613 కేసులు ఉన్నాయని చెప్పారు. స్క్రబ్ టైఫస్ వల్ల వెంటనే మరణాలు సంభవించవని, ఆలస్యంగా ఆసుపత్రికి రావడం వల్ల జరిగినవని స్పష్టం చేశారు.




