చార్‌ధామ్ మార్గంలో 30 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ (వీడియో)

15చూసినవారు
ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ పర్వత ప్రాంతాలు భారీ వాహన రద్దీతో కిక్కిరిసిపోయాయి. వారాంతపు సెలవులు, చార్‌ధామ్ యాత్ర రద్దీ కారణంగా జోషీమఠ్ సమీపంలో 25 నుంచి 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విష్ణుప్రయాగ్ నుంచి జోషీమఠ్ మీదుగా మార్వాడి వరకు వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో వేలాది మంది యాత్రికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, ఆహారం, మరుగుదొడ్ల వంటి కనీస సదుపాయాలు లేక చిన్నారులు, వృద్ధులు, మహిళలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముస్సోరీ, నైనిటాల్, మనాలీ వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్