గణేష్ నిమజ్జనాలతో నగరంలో ట్రాఫిక్ జామ్.. వాహనదారులకు చుక్కలు

13చూసినవారు
TG: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు మరుసటి రోజు కూడా కొనసాగడంతో శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బషీర్‌బాగ్‌లో వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతకుముందు రోజు నుంచే పలు రహదారులు వాహనాలతో కిక్కిరిశాయి. ఈ నిమజ్జనోత్సవాల కారణంగా నగరంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్