నేటి నుంచి మరో 14 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు

3చూసినవారు
నేటి నుంచి మరో 14 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు
హైదరాబాద్‌లోని వైశాలినగర్‌ రైల్వే అండర్‌ పాస్‌ వద్ద రోడ్డు విస్తరణ, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీ పనుల కారణంగా ట్రాఫిక్‌ ఆంక్షలను మరో 14 రోజులు పొడిగించారు. సెప్టెంబర్‌ 3 నుంచి 16 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. గతంలో విధించిన ఆంక్షలు పూర్తవకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైశాలినగర్‌ అండర్‌పాస్‌ మీదుగా వెళ్లే వాహనాలను మైహోమ్‌ మంగళ టి-జంక్షన్‌ వద్ద మళ్లిస్తారు. ప్రయాణికులు సహకరించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్