హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సర్‌ప్లస్ నాలాపై కొత్త వంతెన నిర్మాణ పనుల నేపథ్యంలో, ఈ నెల 13 నుంచి 15 వరకు ఆయా ప్రాంతాల్లో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు నగర జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ జోయల్ డేవిస్ తెలిపారు. హిమాయత్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరాపార్కు వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని వాహనదారులకు సూచించారు.