విషాదాలు.. వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి

96చూసినవారు
విషాదాలు.. వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
AP: రాష్ట్రంలో ఆదివారం వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. తిరుపతి నగరంలోని తాతయ్యగుంటకు చెందిన శివ (35), నరేశ్ (36), శేఖర్ కలిసి మల్లెమడుగు రిజర్వాయర్ వద్ద ఈత కొట్టేందుకు వెళ్లారు. శివ నీటిలో మునిగిపోతుండగా.. కాపాడేందుకు వెళ్లిన నరేష్ కూడా నీటిలో మునిగిపోయాడు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. అటు శ్రీకాకుళం జిల్లా పందిగుంట గ్రామంలో నీటి కుంటలో మునిగి సుధీర్ (9), అభిలాష్ (9) మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్