విషాదం.. కలుషిత నీరు తాగి 6 నెలల పసికందు మృతి

37చూసినవారు
విషాదం.. కలుషిత నీరు తాగి 6 నెలల పసికందు మృతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీటిని తాగి పలువురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. అయితే మృతులలో 6 నెలల పసికందు కూడా ఉండటం హృదయాలను కలచివేస్తోంది. తల్లి సాధన మున్సిపల్ కుళాయి నీటిని పాలలో కలిపి బిడ్డకు తాగించింది. వాంతులు చేసుకున్న కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పదేళ్ల ప్రార్థనల తర్వాత సంతానం కలిగిందని, పెద్ద కూతురు (10) కడుపునొప్పితో బాధపడుతోందని ఆ తల్లి గుండెలు బాదుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్