మాజీ భారత క్రికెటర్ ఎస్. శ్రీశాంత్ ఇంట్లో విషాదం నెలకొంది. శ్రీశాంత్ తండ్రి వి. సంతకుమారన్ నాయర్ కన్నుమూశారు. కొచ్చికి చెందిన ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రీశాంత్ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.