గణపతి నిమజ్జనంలో విషాదం (వీడియో)

66885చూసినవారు
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గణేష్ విగ్రహం నిమజ్జనం చేస్తుండగా ఒక యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడు యరవల్లికి చెందిన ప్రదీప్ (28)గా గుర్తించారు. దీంతో పండుగ పూట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే నిమజ్జనం సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చిన్న పిల్లలను నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్