పిక్నిక్‌లో విషాదం.. డ్యామ్ గేటు తెరవడంతో ఆరుగురు మృతి
By Sai shivani 45చూసినవారుకర్నాటకలోని తుమకూరులో విషాదం చోటుచేసుకున్నది. మర్కోనహల్లి డ్యామ్ గేట్లు తెరవడంతో ఆ ప్రవాహంలో ఆరుగురు కొట్టుకుపోయారు. పిక్నిక్‌లో భాగంగా 15 మంది డ్యామ్ వద్దకు వెళ్లారు. దీంట్లో ఏడుగురు చిన్నారులు, మహిళలు నీటిలోకి ప్రవేశించారు. అయితే అకస్మాత్తుగా సైఫన్ సిస్టమ్తెరుచుకోగా, నీటిలో ఉన్న ఏడుగురు కొట్టుకుపోయారు. రెస్క్యూ బృందాలు నవాజ్ అనే వ్యక్తిని కాపాడారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన మరో నలగురి కోసం గాలిస్తున్నారు.