బీహార్‌లోని నలందా జిల్లాలో జరుగుతున్న రాజ్‌గిర్ మల్మాస్ జాతరలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 'సునామీ' స్వింగ్‌పై నుంచి జారిపడి 25 ఏళ్ల అమన్ కుమార్ అనే యువకుడు మృతి చెందాడు. స్వింగ్ కదులుతున్న సమయంలో సేఫ్టీ బెల్ట్ ఊడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన అమన్‌ను ఆసుపత్రుకి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన స్వింగ్‌ను స్వాధీనం చేసుకుని, ఆపరేటర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.