వినాయక నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరు స్పాట్ డెడ్ (వీడియో)

51025చూసినవారు
AP: అల్లూరి జిల్లాలో జరిగిన వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. పాడేరు మండలం చింతలవీధిలో భక్తులు గణేశ్ శోభాయాత్రలో నృత్యం చేస్తుండగా ఓ స్కార్పియో కారు అతి వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో నడిపినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్