ఈజిప్ట్‌లో సోషల్ మీడియా ట్రెండ్ విషాదం మిగిల్చింది. కైరోలో ఉడకబెట్టని ఇన్‌స్టంట్ న్యూడిల్స్ తినడం ట్రెండ్‌గా మారగా, ఆగస్టు 25న 13 ఏళ్ల బాలుడు మూడు ప్యాకెట్లు తిన్న 30 నిమిషాల్లోనే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి న్యూడిల్స్ సాంపిల్స్‌ను టెస్ట్‌కు పంపగా, లోపం లేదని తేలింది. పోస్ట్‌మార్టం రిపోర్టు ప్రకారం ఉడకబెట్టని న్యూడిల్స్ తినటం వల్ల అక్యూట్ బోవెల్ ఎమర్జెన్సీ వచ్చి బాలుడు మరణించాడని తేలింది.