విషాదం.. దంపతులు మృతి

2చూసినవారు
విషాదం.. దంపతులు మృతి
AP: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల సమీపంలో గురువారం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో NTR జిల్లా కొండూరు మండలం చెవుటూరుకు చెందిన మురళీకృష్ణ, ఆయన భార్య మాధవీలత, కుమార్తె లిఖిత గాయపడ్డారు. నెల్లూరు కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వెంకట్రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్