బతుకమ్మ వేడుకల్లో విషాదం.. నవ వధువు మృతి

43చూసినవారు
బతుకమ్మ వేడుకల్లో విషాదం.. నవ వధువు మృతి
TG: నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడు గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల వివాహం చేసుకున్న నవవధువు రుషిత, తొలి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న తర్వాత తలనొప్పితో బాధపడింది. కుటుంబ సభ్యులు ఆమెకు స్థానికంగా చికిత్స అందించి, బైంసా పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూనే ఆమె మృతి చెందింది. ఈ ఘటన బాధిత కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్