గణేష్ నిమజ్జనంలో విషాదం.. నీట మునిగి వ్యక్తి మృతి

2701చూసినవారు
గణేష్ నిమజ్జనంలో విషాదం.. నీట మునిగి వ్యక్తి మృతి
TG: నిర్మల్(D) కడెం(M) ధర్మాజీపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కుర్రగూడ గ్రామంలో గణేష్ నిమజ్జనం విషాదాంతమైంది. కుర్రగూడ సమీపంలోని కడెం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో గణేష్ మండప నిర్వాహకులు గణపతిని నిమజ్జనం చేస్తుండగా చుంచు రమేష్ (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగాడు. వెంటనే రమేష్ను నీటిలో నుండి బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్