హోలీ వేడుకల్లో విషాదం.. నీటిగుంటలో పడి విద్యార్థి గల్లంతు

33చూసినవారు
AP: హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నీటిగుంటలో పడి ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన పల్నాడు(D) నరసరావుపేట(M) బసికాపురంలో జరిగింది. హొలీ సందర్భంగా ఈత కొట్టేందుకు నలుగురు ఫ్రెండ్స్ నీటిగుంటలోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురు ఒడ్డుకు చేరుకోగా మరో విద్యార్థి గల్లంతయ్యాడు. గల్లంతైన విద్యార్థిని మునిగి గ్రామానికి చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ గోపీగా గుర్తించారు. గోపీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :