TG: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో విషాదం చోటుచేసుకుంది. కైరిగూడ గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు భార్యాభర్తలు మృతి చెందారు. టేకం భీమ్‌రావు, రాజుబాయి చేనులో వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.