AP: బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం, దేశాయిపేట పంచాయతీ, అమోదగిరి పట్నానికి చెందిన చేనేత కుటుంబానికి చెందిన భార్యాభర్తలు బుధవారం ఉదయం మరణించారు. గత కొంతకాలంగా పక్షవాతంతో అనారోగ్యంగా ఉన్న ఇనగాల పార్వతి (60) మరణించడంతో, ఆందోళనకు గురైన భర్త ఇనగాల మోహన్ రావు (65) బాత్రూంలో కాలు జారి పడి దుర్మరణం చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. దంపతుల మృతితో స్థానికంగా తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి.