బ్రెజిల్‌లో బంజీ జంప్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా 21 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. వంతెనపై నుంచి దూకే ముందు భద్రతా తాడును సరిగ్గా తగిలించకపోవడంతో ఆమె 40 మీటర్ల లోతులో పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.. నిర్లక్ష్యం వహించిన ఆరుగురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.