AP: తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మండలం ఉగ్గుముడిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను వరలక్ష్మి (24), వర్షిత్ (4), ప్రశాంత్ (2)గా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వివాహిత ఈ దారుణానికి పాల్పడినట్టు గ్రామస్థులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.