AP: అంతర్వేది బీచ్ సమీపంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన ముగ్గురు యువకులు తమ థార్ కారులో బీచ్‌లో డ్రైవ్ చేస్తుండగా, అన్నాచెల్లెళ్ల గట్టు వద్ద మలుపు గమనించకపోవడంతో కారు అదుపుతప్పి నేరుగా సముద్రంలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఒక యువకుడు బయటకు దూకేయగా, మరో యువకుడు కారుతో పాటు సముద్రంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.