TG: స్కూల్ విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది. హన్మకొండలోని నయీమ్ నగర్ లో ఉన్న తేజస్వి స్కూల్‌లో 4వ తరగతి చదివే సర్జీత్ ప్రేమ్ అనే విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందాడు. తల్లిదండ్రులకు తెలియకుండా విద్యార్థిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించడంతో పాఠశాల సిబ్బందిపై విద్యార్థి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే బాలుడు బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్యులు తెలిపారు.