విషాదం.. కృష్ణా నదిలో ఇద్దరు గల్లంతు (వీడియో)

30254చూసినవారు
AP: గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలంలోని రాయపూడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో ఈతకు దిగి ఇద్దరు కార్మికులు నీటిలో గల్లంతయ్యారు. ఆదివారం కావడంతో సరదాగా నదిలోకి పవన్, దినేశ్ వెళ్లారు. ఈత కొడుతున్న సమయంలో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. దీన్ని గమనించిన స్థానికులు ఇద్దర్నీ బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్