విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతు

6చూసినవారు
AP: కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. కేసీ కెనాల్‌లో 12 గంటల వ్యవధిలో ఇద్దరు గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి అభివర్ధన్(12) అనే బాలుడు గల్లంతవ్వగా.. అధికారులు మృతదేహాన్ని వెలికి తీశారు. కాగా, సోమవారం ఉదయం అజయ్ కుమార్ (25) అనే యువకుడు కేసీ కెనాల్‌లో గల్లంతయ్యాడు. అజయ్‌ కుమార్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్