విషాదం.. లారీ ఢీకొని ఇద్దరు యువకుల మృతి

38చూసినవారు
విషాదం.. లారీ ఢీకొని ఇద్దరు యువకుల మృతి
AP: అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో విషాదం చోటు చేసుకుంది. బయ్యవరం దగ్గర లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. అగనంపూడి ప్రాంతానికి చెందిన అఖిల్ (25), అజయ్ (20) బైక్‌పై యానాం బయలుదేరారు. బయ్యవరం వద్ద అర్ధరాత్రి లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్