AP: పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మండలం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దిగమర్రు రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తణుకు పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. కొల్లి మహేశ్ రాజు (18), సాయి గణేష్ (19), శరవణశర్మ బుల్లెట్ పై పేరుపాలెం బీచ్ కు వెళ్తుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ప్రమాదంలో మహేశ్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా గణేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.