విషాదం.. కూతురి కాపురాన్ని చక్కదిద్దేందుకు వెళ్లి..

50చూసినవారు
విషాదం.. కూతురి కాపురాన్ని చక్కదిద్దేందుకు వెళ్లి..
AP: కూతురి కాపురాన్ని చక్కదిద్దేందుకు వెళ్లి సమన్వయం కుదరదని తెలిసి ఆమె, మనవరాలితో కలిసి చనిపోవాలనుకున్న ఓ తల్లి గోదావరిలో దూకి గల్లంతైంది. దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన ఈగల ధనలక్ష్మి (40) తన కూమార్తె విజయకుమారికి మండపేటకు చెందిన విజయ్‌కుమార్‌కు ఇచ్చి 2020లో వివాహం చేశారు. ఇటీవల గొడవలు జరగడంతో కుమార్తె, మనవరాలితో కలిసి ఆమె శుక్రవారం రాజమహేంద్రవరం వచ్చారు. ఆటోలో వంతెన దగ్గర దిగి.. గోదావరిలో దూకాలని నిర్ణయించారు. ధనలక్ష్మి నదిలో దూకి గల్లంతవ్వగా.. కూతురు, మనవరాలిని స్థానికులు కాపాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్