AP: విశాఖలోని ఆరిలోవ హెల్త్ సిటీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం రామన్నపేటకు చెందిన సాయికిరణ్ పుట్టినరోజు సందర్భంగా బైక్‌పై సింహాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాయికిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.