
ఏపీలోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ ప్రారంభం
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జనవరి 1 నుంచి రేషన్ కార్డుదారులకు గోధుమ పిండిని ప్రయోగాత్మకంగా పంపిణీ చేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో కిలో రూ. 20కు గోధుమ పిండిని అందిస్తున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ ఎండీ ఢిల్లీరావు తెలిపారు. కేంద్రం నుంచి తీసుకోని 1800 టన్నుల గోధుమలను పాత పద్ధతిలో పిండి పట్టించి పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల పోషకాలు ఎక్కువగా ఉంటాయని ఆయన చెప్పారు. జిల్లా కేంద్రాల్లో విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు.




